
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)
అమెరికా తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత హెచ్-1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది (H-1B visa applicants). ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
వీసా (Visa) అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని ఈమెయిల్ అందినవారికి.. కొత్త అపాయింట్‌మెంట్ డేట్ విషయంలో సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. అలాగే రీషెడ్యూలింగ్ గురించి తెలియజేసిన తర్వాత కూడా గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీకి కాన్సులేట్‌కు రావొద్దని సూచించింది. మళ్లీ కొత్త తేదీలపై స్పష్టత లేనప్పటికీ.. డిసెంబర్‌లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. అమెరికా వీసా రద్దును స్టేట్ డిపార్ట్‌మెంట్ గణనీయంగా పెంచిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రకటన వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ