
బెంగళూరు, 10 డిసెంబర్ (హి.స.)మన దేశంలో చాలా మందికి రోజువారీ అలవాటు టీతో బిస్కెట్లు తినడం. ఉదయం నిద్రలేవగానే కప్పు టీ కడుపులో పడితేనే మరో పని ముట్టుకుంటారు. టీతో పాటు బిస్కెట్లు తినడం కూడా మంచిదని భావిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సాధారణ అలవాటు ఆరోగ్యానికి అంతే ప్రమాదకరం. టీ, బిస్కెట్ కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థ, రక్తంలో చక్కెర, జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ టీతో బిస్కెట్లు తినడం ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూద్దాం..
చాలా మంది టీతో బిస్కెట్లు తినడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు టీతో వివిధ రకాల స్నాక్స్‌ను కలిపి తింటారు. ఇందులో బిస్కెట్లు ప్రముఖంగా ఉంటాయి.
హై గ్లైసెమిక్ ఇండెక్స్ : బిస్కెట్స్ లో ఉపయోగించే పిండిలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది డయాబెటిక్ రోగులకు హానికరంగా మారే అవకాశం ఉంది.
ప్రయాణాలలో ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్న సమయంలో లేదా సినిమాలు, స్పోర్ట్స్ చూసి ఎంజాయ్ చేసే టైములో చాలా మంది తినే స్నాక్స్‌లో బిస్కెట్లు కూడా ఒకటి. ఇవి మనకు అనేక రకాల రూపాల్లో అందుబాటులోఉన్నాయి. కుకీస్, క్రీమ్, సాల్ట్ ఇలా వివిధ వెరైటీల్లో మనకు బిస్కెట్లు లభిస్తున్నాయి. అయితే బిస్కెట్లను తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు మనం వాటిని తినవచ్చా..? బిస్కెట్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి..? అన్న సందేహాలు చాలా మందికి తరచూ వస్తుంటాయి. అయితే ఇందుకు ఆయుష్ వైద్య నిపుణులు డా. అవినాశ్ జె .పి సమాధానాలు చెబుతున్నారు.
టీ, బిస్కెట్ల కలయిక పేగులలోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది. జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. బరువు, గ్యాస్, కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది. అదనంగా, టీలోని టానిన్లు నీటి నిలుపుదలను పెంచుతాయి. బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. మరోవైపు శుద్ధి చేసిన పిండి, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు కలిగిన బిస్కెట్లు ఉదయాన్నే తినటం వల్ల కొవ్వును నిల్వ చేస్తాయి. ఇది క్రమంగా బొడ్డు కొవ్వు, బరువు పెరగడానికి దారితీస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV