
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)
ఇండిగో సంక్షోభం (IndiGo flight crisis) వల్ల దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్స్ రాకపోకలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. దీనివల్ల గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25శాతం తగ్గిందని వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారని.. అందులో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్ ట్రావెలర్స్ ఉంటారని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ