
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 09 డిసెంబర్ (హి.స.)
యూఎన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాళ్లదాడి, విధ్వంసం, పోలీసులతో తీవ్రమైన దాడి జరిగింది. సింధి సంస్కృతి దినోత్సవం నాడు నిరసనకారులు వీధుల్లోకి వచ్చిన తర్వాత ఆదివారం హింస ప్రారంభమైంది. జియే సింధ్ ముత్తహిదా మహాజ్ (JSSM) బ్యానర్ కింద సింధీల పెద్ద ఎత్తున స్వేచ్ఛ కావాలని, ‘‘పాకిస్తాన్ ముర్దాబాద్’’ నినాదాలు చేశారు. సింధ్ విముక్తి కోసం పిలుపునిచ్చారు.
సింధు నదికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంతో 1947 విభజనకు ముందు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పాకిస్తాన్‌లో చేరింది. ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలు, పాక్ పంజాబీల అణిచివేత, దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ