ప్రతి రోజూ నిమ్మకాయ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
బెంగళూరు, 11 డిసెంబర్ (హి.స.)సిట్రస్ పండ్లలో రారాజుగా పిలిచే నిమ్మకాయలు కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. విటమిన్ సి, ఫైబర్‌తో సహా అనేక కీలక పోషకాలకు నిలయం. మీ రోజూవారీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవచ్చని
బెంగళూరు,


బెంగళూరు, 11 డిసెంబర్ (హి.స.)సిట్రస్ పండ్లలో రారాజుగా పిలిచే నిమ్మకాయలు కేవలం రుచిని పెంచడానికి మాత్రమే కాదు.. విటమిన్ సి, ఫైబర్‌తో సహా అనేక కీలక పోషకాలకు నిలయం. మీ రోజూవారీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయుష్ వైద్య నిపుణులు డా. అవినాశ్ జె .పి చెబుతున్నారు. నిమ్మకాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి సహాయ పడుతుంది..

ప్రతిరోజూ.. నిమ్మకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడటంతో పాటు బరువు కూడా తగ్గుతారని నిపుణులు అంటున్నారు. నిమ్మకాయలలోని పెక్టిన్ ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలన్న ఆలోచిస్తారు. దానితో పాటు నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కొవ్వును కరిగిస్తుంది. బదులుగా నీటిని తాగేవారు బరువు తగ్గుతారు.

రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది..

నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ప్రతిరోజూ నిమ్మకాయ నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరాల తీవ్రతను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. నిమ్మకాయ నీటితో మీ రోజును ప్రారంభించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా రోగనిరోధక శక్తి అధికంగా మెరుగుపడుతుంది.

ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తోంది..

నిమ్మకాయలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఉదయం నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. శారీరక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీంతో ఇది మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande