గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాద ఘటన.. థాయ్‌లాండ్‌లో యజమానులు అదుపులోకి
గోవా/ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు, క్లబ్‌ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి అధికారులు వారిని అద
గోవా నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాద ఘటన.. థాయ్‌లాండ్‌లో యజమానులు అదుపులోకి


గోవా/ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire)పై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు, క్లబ్‌ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

ఈనెల 6న రాత్రి 11.45 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. నిందితులిద్దరూ 7న ఉదయం 5.30 గంటలకు ఓ విమానంలో థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పారిపోయినట్లు ముంబయిలోని ‘బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్‌’ గుర్తించినట్లు ఇప్పటికే పోలీసులు తెలిపారు. వారి పాస్‌పోర్టులు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఆ దేశంలో ఉండటం చట్టవిరుద్ధం. దాంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లో భారత్‌కు తరలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande