
ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) ఎన్నికల సంస్కరణలపై బుధవారం పార్లమెంట్‌లో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అసలు ఓట్లు చోరీ చేసిందే కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. నెహ్రూ, ఇందిరాగాందీ, సోనియా గాంధీ వేర్వేరు సమయాల్లో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా అమిత్ షా ప్రసంగించారు
పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగంపై ప్రధాని మోడీ ఫిదా అయ్యారు. అద్భుతంగా ప్రసంగించారంటూ ఎక్స్‌లో ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియపై నిర్దిష్ట వాస్తవాలను వివిధ కోణాల్లో తెలియజేశారని కొనియాడారు. అంతేకాకుండా ప్రజాస్వామ్య బలాన్ని హైలైట్ చేయడమే కాకుండా ప్రతిపక్షాల అబద్ధాలను కూడా బట్టబయలు చేశారంటూ మోడీ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ