
ఢిల్లీ11 డిసెంబర్ (హి.స.)
ఢిల్లీలో రద్దయిన నోట్ల కట్టలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని వజీర్ పూర్ లో కార్లలో కోట్ల విలువలో ఉన్న రద్దయిన పాత రూ.1000, రూ.500 నోట్ల కట్టలను బ్యాగులలో పెట్టి కార్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టబడటం సంచలనంగా మారింది. పెద్దనోట్ల రద్దు జరిగి ఏళ్లు గడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు భారీ మొత్తంలో పాత కరెన్సీ పట్టుబడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులు నోట్ల బ్యాగులతో పాటు వాహనాలను, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఈ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి. పాత కరెన్సీ మార్చడానికి ప్రయత్నిస్తున్నారా.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే నోట్ల రద్దు తరవాత పాతనోట్లు ఎక్కడో ఒక దగ్గర పట్టుబడుతూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే తొలిసారి.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV