భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు
ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్‌’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్‌ ఆ
Elon Musk


ఢిల్లీ 11 డిసెంబర్ (హి.స.) ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్‌’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్‌ సేవలను అందిస్తోంది. ఈ స్టార్‌లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. స్టార్‌లింక్‌తో భారత్‌కు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande