ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ, 13 డిసెంబర్ (హి.స.)ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు అనిల్ చౌహన్. అకాడమీలో క్యాడేట్లకు అత్యుత్
Indian Army


ఢిల్లీ, 13 డిసెంబర్ (హి.స.)ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇవాళ(శనివారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు అనిల్ చౌహన్.

అకాడమీలో క్యాడేట్లకు అత్యుత్తమ శిక్షణ అందిందని వ్యాఖ్యానించారు. దేశ సేవకు తమ పిల్లలను అందించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ తరాలకు మీరు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎవరు చేసే తప్పులకు వారే బాధ్యలు అవుతారని పేర్కొన్నారు. సైన్యం తమ విధిలో నిర్లక్ష్యం చేయొద్దని.. అలసత్వం అసలు పనికిరాదని హెచ్చరించారు అనిల్ చౌహన్.

దేశ సేవలో చివరి శ్వాస వరకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు యుద్దాలు ఫీల్డ్‌లోనే జరిగేవని.. కానీ ఇప్పుడు సాంకేతికతతో కూడుకున్నదని ప్రస్తావించారు. సమాజంలో ఏఐ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. కొత్త సాకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande