కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో గందరగోళం.. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని ఆవేదన
కోల్‌కతా/ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సందడి చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ పేరుతో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఈరోజు (డిసెంబర్ 13న) ఆవిష్కరించారు.
కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో గందరగోళం.. మెస్సీ త్వరగా వెళ్లిపోయారని ఆవేదన


కోల్‌కతా/ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సందడి చేశారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ పేరుతో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఈరోజు (డిసెంబర్ 13న) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌, పశ్చిమ బెంగాల్ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెస్సీని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇక, స్టేడియంలో తిరుగుతూ అభిమానులను మెస్సీ అలరించారు. దీంతో స్టేడియం మొత్తం మెస్సీ నినాదాలతో మారుమోగిపోయింది.

ఇక, కోల్‌క‌తా పర్యటన ముగించుకుని లియోన‌ల్ మెస్సీ హైద‌రాబాద్‌కు స్టార్ట్ అయ్యారు. కాగా, సాల్ట్‌లేక్ స్టేడియంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు కొనసాగుతున్నాయి. మెస్సీ.. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోవ‌డంపై అభిమానులు నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు

నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. ప్లేక్సీలు, కటౌట్‌లు చించేవారు. కొన్నింటించి అంటించేశారు.

దీందో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. ఇక ఘటనపై ఫ్యాన్స్ మాట్లాడుతూ.. మెస్సీని చూసేందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చామని.. ఒక్కో టికెట్‌ను రూ.5 నుంచి 45 వేల ఖచ్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటి కనీసం ఆయన్ను ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

. ఈ సందర్భంగా స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసిన ఫ్యాన్స్‌.. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ఫ్యాన్స్‌ ప్రయత్నించారు. అభిమానులు గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్‌ బయటకు వెళ్లిపోయారు. స్టేడియంలో నెలకొన్న గంద‌ర‌గోళ ప‌రిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande