కాలుష్యంపై యుద్ధం.. ప్రపంచ బ్యాంక్ రూ.3,600 కోట్ల సాయం
చండీగఢ్‌/ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) : హర్యానా సర్కారు కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమం ‘హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ను ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్ర
కాలుష్యంపై యుద్ధం.. ప్రపంచ బ్యాంక్ రూ.3,600 కోట్ల సాయం


చండీగఢ్‌/ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) : హర్యానా సర్కారు కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యంత ప్రతిష్టాత్మక పర్యావరణ కార్యక్రమం ‘హర్యానా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ను ప్రపంచ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. మొత్తం రూ. 3,600 కోట్ల కార్పస్‌తో రూపొందించిన ఈ ఐదేళ్ల ప్రాజెక్ట్.. రాష్ట్రంలో వాయు నాణ్యతను గణనీయంగా మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో పారిశ్రామిక నవీకరణలు, ఈ-బస్సుల ఏర్పాటు, మెరుగైన పర్యవేక్షణ మౌలిక సదుపాయాలు మొదలైనవి కీలకంగా ఉన్నాయి. ఈ భారీ కార్యక్రమం ద్వారా హర్యానా సర్కారు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ప్రమాదకరమైన వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌లో కాలుష్య రహిత పరిశ్రమల ప్రోత్సాహానికి చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 1,000 పరిశ్రమలకు వాయు ఇంధనాలపై నడిచే కొత్త బాయిలర్‌లను కొనుగోలు చేయనున్నారు. అదే విధంగా 1,000 డీజీ సెట్‌లను హైబ్రిడ్/డ్యూయల్ ఫ్యూయల్ మోడ్‌పై నడిచేలా చేస్తారు. రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి 500 ఈ-బస్సులను ఏర్పాటు చేయనున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande