
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)
అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెర్లోపాలెం, గణపర్తి గ్రామాలకు చెందిన దుర్గ, ధనుష్‌లు అర్ధరాత్రి బైకుపై వెళుతూ ఉన్నారు. అచ్యుతాపురం మండలం, ఎం జగన్నాధపుం గ్రామ సమీపంలో బైకు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరూ యువకులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్గ, ధనుష్‌ల మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ