ఓట్ల లెక్కింపును తప్పులు లేకుండా చేపట్టాలి.. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
కామారెడ్డి, 14 డిసెంబర్ (హి.స.) జిల్లాలో రెండో విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని తప్పులు లేకుండా ప్రశాంతంగా లెక్కించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ
కామారెడ్డి కలెక్టర్


కామారెడ్డి, 14 డిసెంబర్ (హి.స.)

జిల్లాలో రెండో విడత జరుగుతున్న

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని తప్పులు లేకుండా ప్రశాంతంగా లెక్కించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రలు సందర్శించారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు పరిశీలన చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande