
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో గ్రామ పంచాయతీ
ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని వారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 192 మండలాల్లోని 3,911 సర్పంచ్ లు, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిశాక గంట సేపు భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలను ను ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత పోలింగ్లో పలు చోట్ల స్పల్ప ఘర్షణలు, ఉద్రిక్తతలు మినహా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. .
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..