
హైదరాబాద్, 14 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో 'ఓట్ చోరీ'కి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రంలో స్వయంప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ను జేబు సంస్థగా మార్చేసిందని ఫైర్ అయ్యారు. 'ఓట్ చోరీ' విషయంలో కేంద్రానికి సెగ తగలాలనే ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.
డీసీసీ పదవుల్లో బీసీలకు పార్టీలో ప్రాధాన్యం పెరిగిందన్నారు. తాను కేబినెట్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్ పాటు ఎవరూ పోటీ పడని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..