
విశాఖపట్నం,, 14 డిసెంబర్ (హి.స.):విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో నేవీ మారథాన్2025ను )ఇవాళ(ఆదివారం) నిర్వహించారు. 42కే, 21కే, 10కే, 5కే విభాగాల్లో నేవీ మారథాన్ జరిగింది. ఈ మారథాన్‌లో సుమారు 18 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ మారథాన్‌కు సుమారు 17 దేశాల నుంచి విదేశీ రన్నర్లు హాజరయ్యారు.
42కే రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి సంజయ్ బల్లా... 21కే రన్‌ను సంజయ్ బల్లా సతీమణి ప్రియా బల్లా ప్రారంభించారు. 10కే రన్‌ను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్... 5కే రన్‌ను విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో ఉత్సాహంగా రన్నర్లు పాల్గొన్నారు. వైజాగ్ నేవీ మారథాన్ నేపథ్యంలో బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ