సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే మట్టా రాగమయి
ఖమ్మం, 14 డిసెంబర్ (హి.స.) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విస్తృత ప్ర
సత్తుపల్లి ఎమ్మెల్యే


ఖమ్మం, 14 డిసెంబర్ (హి.స.)

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో విస్తృత ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోవాలని, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని దానిలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ప్రీ బస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలతో పాటు అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande