
అమరావతి, 15 డిసెంబర్ (హి.స.), క్రికెట్ మైదానంలో ఓ జట్టు గెలుపు, ఓటములను నిర్ణయించడంలో క్రీడాకారుల ప్రతిభతోపాటు పిచ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌లకు తగ్గట్టుగా పిచ్‌లను రూపొందిస్తారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ మైదానంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని చిదంబరం, చిన్నస్వామి క్రికెట్ మైదానాల్లో పిచ్‌ల తయారీకి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లభ్యమయ్యే ‘బ్లాక్ కాటన్‘ మట్టిని వినియోగిస్తున్నారు. అక్కడ ఓ రైతుకు చెందిన కొబ్బరితోటలో మట్టిని సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు చేయించి పిచ్‌ల తయారీకి అనుకూలమని నిర్ధారించారు. పదేళ్లుగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇదే మట్టిని వినియోగిస్తూ పిచ్‌ను తయారు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ