| గాలివీడు-లక్కిరెడ్డిపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా, 15 డిసెంబర్ (హి.స.)రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి. ఈ క
| గాలివీడు-లక్కిరెడ్డిపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం


అన్నమయ్య జిల్లా, 15 డిసెంబర్ (హి.స.)రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వాహనదారులు ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా (Annamayya District) పరిధిలోని ప్యారంపల్లిగుట్ట వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం కొందరు కూలీలు పని కోసం ఆటోలో ప్రయాణిస్తున్నారు. ప్యారంపల్లిగుట్ట మీదుగా తమ గమ్య స్థానానికి వెళ్తున్నారు. గాలివీడు-లక్కిరెడ్డి మార్గంలో ప్రయాణిస్తున్న వారి ఆటో ప్రమాదానికి గురైంది. ప్యారంపల్లిగుట్ట వద్దకు చేరుకోగానే రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఓ మినీ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా కొట్టింది. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలు భయభ్రాంతులకు గురయ్యారు. దెబ్బలు తాకిన వారు హాహాకారాలు చేయడం ప్రారంభించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆంబులెన్సులో సమీపంలోని రాయచోటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande