ఏసీబీ వలలో ఖమ్మం జిల్లా రెవెన్యూ ఇన్స్పెక్టర్..
ఖమ్మం, 18 డిసెంబర్ (హి.స.) ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ వలలో చిక్కారు. కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువార
ACB


ఖమ్మం, 18 డిసెంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ వలలో చిక్కారు. కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఆమె రెడ్ హ్యాండ్ గా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద వలవేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande