
నరసాపురం, 18 డిసెంబర్ (హి.స.)
, గోదావరి నదికి 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం భక్తులతో పాటు తీర ప్రాంత గ్రామాల ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తుంటారు. పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, పర్యాటక కేంద్రాల అభివృద్ధి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు కొత్త శోభ సంతరించుకోనుండటమే దీనికి కారణం. గోదావరి పుష్కరాల ముహూర్తాన్ని వేద పండితుల సూచనలతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ