
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.):నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు ఊరట లభించలేదు. అద్దేపల్లి బ్రదర్స్, జోగి బ్రదర్స్ బెయిల్ పిటిషన్లను ఎక్సైజ్ కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఏడుగురు నిందితులు.. బాదల్ దాస్ (A7), ప్రదీప్ దాస్ ( A8), కళ్యాణ్ ( A12), రవి (A4), శ్రీనివాస్ తిరుమలశెట్టి (A13), శ్రీనివాస్ రెడ్డి (A11), సతీష్ (A17) లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి శ్రీరాములు, అద్దేపల్లి జనార్దన్ రావు (A1)తోపాటు ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు (A2)తోపాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ కోసం వీరు ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ