
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
విమర్శలపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత పాలనలో బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను చంపేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి చనిపోతామని అందరినీ బ్లాక్ మెయిల్ చేశాడని ఇప్పుడు బీఆర్ఎస్ సర్పంచులు ఆయన్నే ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు.
చదువుకునే పిల్లలతో కూడా కాళ్లు పట్టించారని అన్నారు. తాను బిల్స్ రాకపోతే చంపేస్తానని అన్నానని.. కత్తితో చంపేస్తానని అనలేదన్నారు. తన మాటలను వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిల్లర రాజకీయాలు చేస్తున్నందుకే తాను స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. ఓడినా గెలిచినా తన అభ్యర్థులకు అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరవాతే సర్పంచుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తోందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..