
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.)
అనకాపల్లి పట్టణం: అనకాపల్లి)లోని కెనరా బ్యాంకులో దుండగులు దొపిడీకి ప్రయత్నించగా బ్యాంకు మేనేజర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వారు పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లిలోని రింగ్‌రోడ్‌లో కెనరా బ్యాంకు వద్దకు మధ్యాహ్నం సమయంలో రెండు వాహనాల్లో ఏడుగురు వ్యక్తులు వచ్చారు. వీరిలో ఐదుగురు లోపలికి ప్రవేశించారు. మహిళా మేనేజర్‌కి గన్ చూపించి బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ అలారం నొక్కడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదనపు ఎస్పీ మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ