పథకాన్ని నిర్వీర్యం చేయాలనే గాంధీ పేరు తొలగించారు: ఎంపీ చామల
న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.) ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంతో బ
ఎంపీ చామల


న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.) ఉపాధి హామీ పథకానికి

మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడంతో బీజేపీ ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తోందని అన్నారు. ప్రతి పేదవాడికి పని కల్పించాలన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం వందశాతం పథకం కోసం ఫండింగ్ ఇచ్చేదని అన్నారు.

ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ చేసేలా నిర్ణయం తీసుకుని పథకాన్ని నిర్వర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande