
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో ప్రజాస్వామ్యం
కళ్లముందే హత్యకు గురవుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేయడంతో వారు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గురువారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టాన్నే ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. ఈ బిల్లు నిన్నే కాదు, గత ఏడాదే కాదు, ఏడు సంవత్సరాల ముందే రావాల్సింది, ఎందుకంటే అప్పటికే నష్టం చాలా లోతుగా జరిగింది అని రాజీవ్ గాంధీ మాటలను బండి సంజయ్ గుర్తుచేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..