
న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో విద్యుత్ కు రూ.21 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఈ బడ్జెట్ తో విద్యుత్ బకాయిలు తీర్చే పరిస్థితి లేదన్నారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. విద్యుత్ ఉచిత పథకాలకు కూడా బడ్జెట్ ఏమాత్రం సరిపోదని విమర్శించారు. విద్యుత్ కు సంబంధించి పాత బకాయిలపై దృష్టి పెట్టలేదని, విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాల పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా లక్ష్యాలు ఘనంగా 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమన్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు