కర్నాటకలో చైనా స్పై పక్షి కలకలం.. ఏకంగా GPS ట్రాకర్ లభ్యం
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) పొరుగు దేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. తూర్పు లద్దాఫ్లోని గల్వాన్ (Galwan) ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒ
చైనా స్పై పక్షి


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) పొరుగు దేశం చైనా అవకాశం దొరికినప్పుడల్లా మన దేశంపై విషం చిమ్ముతూనే ఉంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. తూర్పు లద్దాఫ్లోని గల్వాన్ (Galwan) ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒకానొక దశలో తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కర్ణాటకలో చైనాకు చెందిన ఓ స్పై పక్షి కలకలం రేపుతోంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార్ (Karwar)లోని ఠాగూర్ బీచ్లో కదలలేని స్థితిలో సీగల్ పక్షిని స్థానికులు గుర్తించారు. అనంతరం కోస్టల్ పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్కు చేరుకుని సీగల్ పక్షి (Seagull Bird)ను స్వాధీనం చేసుకున్నారు. పక్షి పైభాగంలో సోలార్ ప్యానెల్ అటాచ్ చేసి ఉన్న జీపీఎస్ ట్రాకర్ ను స్వాధీనం చేసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande