
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
ప్రజలు మిమ్మల్ని ఒక అధికారిగా
మాత్రమే కాకుండా ప్రజాసేవకుడిగా గుర్తుపెట్టుకోవడం వల్లనే సివిల్ సర్వీసెస్ హోదాకు న్యాయం చేయగలిగిన వారుగా నిలిచిపోతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ అధికారులు 10 వారాల శిక్షణ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ప్రతిరోజు కార్యాలయాన్ని వదిలి వెళ్లే ముందు మిమ్ములని మీరు ఒక ప్రశ్న వేసుకోండి.. మీ పని ద్వారా ఎవరి జీవితంలో అయినా ఒక మంచి మార్పు, గౌరవాన్ని తీసుకువచ్చిందా ప్రశ్నించుకోండి? అవును సమాధానం వస్తే.. ఆరోజు మీరు ఎంత కఠినపరిస్థితుల్లో విధి నిర్వహణ చేసినా... మీరు విజయం సాధించినట్టే అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..