రాష్ట్రంలో నేటి సాయంత్రంతో ముగిసిన ఎన్నికల కోడ్
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల వి
ఎన్నికల కోడ్


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో జరిగిన పంచాయతీ

ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని ఈసీ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యం లేకుండా బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande