అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం: వైఎస్ జగన్ సంచలన ప్రకటన
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్‌ అని మాజీ సీఎం జగన్ మోన్ రెడ్డి అన్నారు. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట అని, ఇది మరో పెద్ద స్కామ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక
జగన్


అమరావతి, 18 డిసెంబర్ (హి.స.)

ప్రభుత్వం కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్‌ అని మాజీ సీఎం జగన్ మోన్ రెడ్డి అన్నారు. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట అని, ఇది మరో పెద్ద స్కామ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మెడికల్‌ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయని, అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు అని చెప్పారు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు అని , ఇది ఒక పెద్ద స్కామ్‌ అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తామని, ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతామని, అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నామని జగన్ విమర్శించారు. విమర్శించారు.

గవర్నర్‌ 40 మందికి అనుమతి ఇచ్చారని, లోక్‌భవన్‌కు వెళ్లే ముందు అంబేడ్కర్‌ విగ్రహం వరకు వెళ్తామని జగన్ చెప్పారు. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్‌కి కలుస్తామని చెప్పారు. ఆ తర్వాత కోర్టు తలుపు తడుతామన్నారు. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తామని వైఎస్ జగన్ హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande