కరీంనగర్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేతలు
కరీంనగర్, 18 డిసెంబర్ (హి.స.) కరీంనగర్లో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. కాంగ్రెస్ కీలక నేతలు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో
కరీంనగర్ లో హై టెన్షన్


కరీంనగర్, 18 డిసెంబర్ (హి.స.)

కరీంనగర్లో ఉద్రిక్త వాతారవణం నెలకొంది. కాంగ్రెస్ కీలక నేతలు అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నేడు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీ ఆఫీసులను ముట్టించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ముందస్తు సమాచారం మేరకు పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. అనంతరం కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకొగా.. అప్రమత్తమైన పోలీసు అధికారులు కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande