తెలంగాణలో హై టెన్షన్.. కాంగ్రెస్ VS బీజేపీ.. పోటాపోటీగా పార్టీ ఆఫీసుల ముట్టడి
తెలంగాణ, 18 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ నిరసన పిలుపుతో పలు జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రె
తెలంగాణలో హై టెన్షన్


తెలంగాణ, 18 డిసెంబర్ (హి.స.)

కాంగ్రెస్ నిరసన పిలుపుతో పలు జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఇక బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బీజేపీ నాయకులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకు, ఆ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది. సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల ధర్నా జరిగింది. నల్లగొండ లో జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande