ఎట్టకేలకు నోరు విప్పిన ఐ బొమ్మ రవి.. వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు నేడు నోరు విప్పాడు. కేసు లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం నాటి విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. హెచ్ఎ సినిమాల పైరసీపై నోరువిప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా స
హాయ్ బొమ్మ రవి


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు నేడు నోరు విప్పాడు. కేసు లో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం నాటి విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. హెచ్ఎ సినిమాల పైరసీపై నోరువిప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాలను పైరసీ చేసినట్లు ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ను సైతం హ్యాక్ చేసినట్లు చెప్పాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి.. హెచ్ఎ ఫార్మాట్లో రికార్డు చేసినట్లు తెలిపాడు. పైరసీకి హెచ్ హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసి.. అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి.. 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. హిట్-3, కిష్కిందపురి సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారా పైరసీ చేసినట్లు ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande