సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా తెలిసింది.. కేటీఆర్
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో మన సత్త
కేటీఆర్


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో మన సత్తా ఏంటో రాష్ట్రం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే అసలు విషయం తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మనల్ని బయటి వ్యక్తులు ఓడించలేదు.. మనల్ని మనమే స్పష్టంగా ఓడించుకున్నామని తెలుస్తోందన్నారు. చేసిన పని చెప్పుకోలేక.. చేసిన అభివృద్ధి చూపించుకోవడంలో విఫలం చెందామని తెలిపారు. నిజానికి పదేళ్లలో కేసీఆర్ పని దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande