హుస్నాబాద్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, 18 డిసెంబర్ (హి.స.) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించి మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి
మంత్రి పొన్నం


హుస్నాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్

పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించి మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్పై పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్ల అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ను సందర్శించిన మంత్రి, అక్కడ జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే శంకుస్థాపన చేసిన రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, జంక్షన్ల పనులు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande