రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ. 25 వేల నగదు ప్రోత్సాహం: గడ్కరీ
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.) రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించి ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడేవారికి రూ.25 వేలు ప్రోత్సహకం కొనసాగిస్తున్నామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్త
గడ్కరీ


హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించి ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడేవారికి రూ.25 వేలు ప్రోత్సహకం కొనసాగిస్తున్నామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే పోలీసులు కేసులు, కోర్టు ఇబ్బందులు తప్పవని చాలా మంది సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. కానీ సకాలంలో బాధితులను ఆసుపత్రిలో చేరిస్తే చాలా మంది ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారని అందువల్ల ప్రమాద బాధితులకు సహాయం అందించే వారిని 'రాహ్ వీర్' (Raahveer Award) గా గుర్తించి వారికి రూ. 25 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చే వారికి పోలీసులు, కోర్టులతో ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నారు. ఇవాళ లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన గడ్కరీ పలు కీలక అంశాలపై వివరణలు ఇచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande