
నిజామాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ చెత్త పారవేయకుండా ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. కలెక్టర్ గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. రోడ్లపై చెత్త పారవేస్తే జరిమానాలు విధించబడతాయనే విషయాన్ని ఫ్లెక్సీలు, బ్యానర్లు, మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలలో అవగాహన పెంపొందించాలని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు