
న్యూఢిల్లీ, 18 డిసెంబర్ (హి.స.)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్లర్, అజీవికా మిషన్-గ్రామీణ (వీబీ-జీ రామ్ ) (VB-G RAM G Bill) బిల్లు ఇవాళ లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుపై విపక్షాలు సభలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చర్చ సందర్భంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. విపక్షాల ఆందోళనల నడుమనే స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించగా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) .. బిల్లుకు వ్యతిరేకంగా తాము నిరసనలు చేపడతామని తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే రాబోయే నెలల్లో నరేగా పథకం నిర్వీర్యం అవుతుందన్నారు. ఇది పేదల వ్యతిరేక బిల్లు అని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..