ప్రతి వీధిలో కడియం దిష్టిబొమ్మను వేళాడదీస్తా.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
వరంగల్, 18 డిసెంబర్ (హి.స.) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్ర హీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండి రాజయ్య ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ.. మొన
మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య


వరంగల్, 18 డిసెంబర్ (హి.స.)

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్ర హీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండి రాజయ్య ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నా అని.. ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానంటూ కడియం డైలాగులు కొట్టలేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన కీడుకు మందు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande