బీజేపీ అరాచకాలను సహించేది లేదు: విప్ బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి, 18 డిసెంబర్ (హి.స.) కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్న అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హెచ్చరించారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంల
విప్ బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి, 18 డిసెంబర్ (హి.స.)

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో చేస్తున్న అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హెచ్చరించారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ, పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెట్టాలని కుట్రలు చేస్తున్నారని చెప్పారు.

ఇలా ప్రశ్నించే వారిని భయపెట్టాలని కుట్రలు చేస్తున్న బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande