
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా
గాంధీ కుటుంబాన్ని అవమానపరిచి వేధించడమే లక్ష్యంగా నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఓ అస్త్రంగా వాడుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడి దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ కోర్టు విచారించేందుకు నిరాకరించిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్అలకు కోర్టు నిర్ణయం చెంప పెట్టని, వారిద్దరు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..