
సిద్దిపేట, 18 డిసెంబర్ (హి.స.) డిసెంబర్ 21వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎస్ ఎం విజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. రాజీపడ దగిన కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులో ఇతర రాజీ పడ దగిన కేసులలోని నిందితులు, ఫిర్యాదు దారులు సంబంధిత పోలీస్ స్టేషన్ ని లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించి రాజీ పడవచ్చు అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు