
హైదరాబాద్, 18 డిసెంబర్ (హి.స.)
ప్రయాణికులకు ఇండిగో ట్రావెల్
అడ్వైజరీ జారీ చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. చండీగఢ్ దట్టమైన పొగమంచు కారణంగా అనుకూలత తగ్గిందని, ఈ కారణంగా షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. పరిస్థితులను తాము పరిశీలిస్తున్నామని సాధారణ స్థితికి వచ్చిన వెంటనే మీ గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరుస్తామని తెలిపింది.
ఫ్లైట్ స్టేటస్ తెలుసుకునేందుకు యాప్, వెబ్ సైట్లో అప్డేట్గా ఉండాలని సూచించింది. త్వరలో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహకరిస్తున్నందుకు ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు