రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం: ఉత్తర్వులు జారీ
అమరావతి, 18 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అధికారులను
appointment-of-in-charge-officers-for-five-districts-in-the-stat


అమరావతి, 18 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా అధికారులను నియమిస్తుంది. ఇందులో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు జి. వీరపాండియన్, కాకినాడకు ప్రసన్న వెంకటేష్, బాపట్లకు మల్లికార్జున్, శ్రీ సత్యసాయి జిల్లాకు గంధం చంద్రుడు మరియు నంద్యాల జిల్లాకు సి.హెచ్. శ్రీధర్‌లను ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలు అప్పగించారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande