
విజయవాడ, 18 డిసెంబర్ (హి.స.)
పోక్సో కేసులో అత్యాచార బాధితురాలి పేరు బయటకు చెప్పారంటూ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం విచారణను జనవరి 16కి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV