
తిరుమల, 18 డిసెంబర్ (హి.స.)
తిరుమలలో తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయం వద్ద అన్నా డీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. భక్తులు ప్రదర్శించిన ప్లెక్సీలో పళనిస్వామి, జయలలిత ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భక్తుల అత్యుత్సాహంపై టీటీడీ స్పందించింది. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీపీఆర్వో తెలిపారు.
ఇదిలా ఉంటే తిరుమల కొండపై ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయడం గానీ గుర్తులు ప్రదర్శించడానికి కానీ అనుమతి లేదు. ఒకప్పుడు తరచూ రాజకీయ ప్రచారాలు చేయడం, విమర్శలు చేయడం లాంటివి చేసేవారు. కానీ కొంతకాలం క్రితం అలాంటివి పూర్తిగా నిషేదించారు. అయినప్పటికీ కొందరు ఇప్పటికి అలాంటివే చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV