అస్సాంలో ఘోర రైలు ప్రమాదం.. ఏనుగుల గుంపును ఢీకొన్న రాజధాని ఎక్స్‌ప్రెస్.. స్పాట్‌లోనే..
గౌహతి, 20 డిసెంబర్ (హి.స.)అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్, జమునముఖ్ సమీపంలోని సనారోజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో
Assam Train Accident:


గౌహతి, 20 డిసెంబర్ (హి.స.)అస్సాం రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్, జమునముఖ్ సమీపంలోని సనారోజా అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. శుక్రవారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అడవి నుంచి ఒక్కసారిగా రైల్వే ట్రాక్‌పైకి వచ్చిన ఏనుగుల మందను గమనించిన లోకో పైలట్, రైలును ఆపేందుకు అత్యవసర బ్రేకులు వేశారు. అయితే రైలు అప్పటికే వేగంగా ఉండటంతో ఏనుగులను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఇంజిన్‌తో సహా ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఏనుగుల శరీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతం అత్యంత భయానకంగా మారింది.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని లూమ్డింగ్ మీదుగా దారి మళ్లించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. భారీ క్రేన్ల సహాయంతో పట్టాలు తప్పిన కోచ్‌లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా అస్సాంలోని ఈ ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అడవుల మధ్య గుండా వెళ్లే ట్రాక్‌ల వద్ద ఏనుగులను గుర్తించేందుకు ‘AI ఆధారిత సెన్సార్లు’ (Gajraj System) ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతోంది, అయితే ఈ ప్రాంతంలో ఆ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. మూగజీవాల ప్రాణాలు కాపాడేందుకు రైల్వే శాఖ మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande