
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
దట్టమైన మంచు కారణంగా లో
విజిబిలిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) హెలికాప్టర్ శనివారం పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లా తాహర్పూర్ (Taharpur)లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ల్యాండ్ కాలేదు. దీంతో హెలీప్యాడ్ పైన కొంతసేపు తిరిగిన తర్వాత హెలికాప్టర్ యూ-టర్న్ తీసుకుని కోల్కతా ఎయిర్పోర్టుకు సురక్షితంగా చేరింది. కాగా, ఇవాళ ఉదయం సుమారు 10.40కి ప్రధాని మోడీ కోల్కతాకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నాదియా జిల్లాలోని తాహర్పూర్కు బయలుదేరారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు